Sribagh Pact: నేటితో శ్రీ బాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు, వికేంద్రీకరణ ఆకాంక్షను తెలియజేస్తూ శ్రీబాగ్ ఒడంబడిక 85వ సంస్మరణ దినోత్సవాలను జరుపుకున్న నేతలు
నేడు శ్రీ బాగ్ ఒప్పందం కుదిరిన ఈ రోజు . ఈ సందర్భంగా కర్నూలు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం, తిరుపతి, శ్రీ సత్యసాయి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇంచార్జిలు, ప్రజలతో కలిసి మానవహారంగా ఏర్పడి ప్రజాకూటమికి మద్దతు తెలిపారు.శ్రీభాగ్ సంస్మరణం దినోత్సవాన్ని జరుపుకుంటూ విద్యార్థులు మానవహార ప్రదర్శన నిర్వహించారు. నాయకులూ. శ్రీబాగ్ సంస్మరణ రోజుని గుర్తు చేస్తూ వికేంద్రీకరణ ఆకాంక్షను తెలియజేసారు.
1937 నవంబర్ 16న వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి గురించి మొట్టమొదటి సారి ప్రస్తావించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలగించేందుకు కుదిరిన ఒప్పందమే ఈ శ్రీబాగ్ ఒడంబడిక. ఈ వికేంద్రీకరణ సారాంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా నేడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)