Pulichinthala Dam: కృష్ణానది వరద ఉధృతి.. ఊడిపోయిన పులిచింతల ప్రాజెక్టులోని గేట్, ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు, నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
కృష్ణానది వరద ఉధృతి ఎక్కువగా ఉంది, ఈ క్రమంలో పులిచింతల ప్రాజెక్టులో ఓ గేట్ ప్రమాదవషాత్తూ ఊడిపోయింది. నీటిని విడుదల చేసే క్రమంలో పులిచింతల ప్రాజెక్టులోని 16వ గేట్ సాంకేతిక సమస్యతో ఊడిపోయింది. ఊడిపోయిన ఈ గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయనున్న అధికారులు. దీని కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి పెరగనున్న వరద ఉధృతి. ఈ నేపథ్యంలో కృష్ణా , గుంటూరు జిల్లా అధికారయంత్రంగం అప్రమత్తమైంది. నదిపరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నదిదాటే ప్రయత్నం చేయరాదని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు ప్రజలను హెచ్చరించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)