Aircraft Flying over Tirumala Temple: వీడియో ఇదిగో, తిరుమల కొండపై మరోసారి ఎగిరిన విమానం, ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై విమానం ఎగరడం అపచారం
ఇటీవల తిరుమల ఆలయంపై వరుసగా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద మరోసారి విమానం ఎగిరింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై విమానం ఎగరడం అపచారంగా భావిస్తారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల తిరుమల ఆలయంపై వరుసగా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద మరోసారి విమానం ఎగిరింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై విమానం ఎగరడం అపచారంగా భావిస్తారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల హోంమంత్రి వంగలపూడి అనిత తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇంతలోనే తాజాగా విమానం చక్కర్లు (Aircraft Flying over Tirumala Temple) కొట్టడం గమనార్హం.
తిరుమల కొండపై గురువారం ఉదయం ఓ విమానం తిరుమల శ్రీవారి ఆలయానికి దగ్గరగా వెళ్లింది. విమానం వెళ్లే సమయంలో భక్తులు ఫొటోలు, వీడియోలు తీశారు.టీటీడీ గతంలోనూ కేంద్ర పౌరవిమానయాన శాఖ దృష్టికి తీసుకెళ్లింది.. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కోరింది. కానీ, కేంద్రం మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు.
Aircraft Flying over Tirumala Temple
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)