Anakapalle Suicide: అనకాపల్లిలో తీవ్ర విషాదం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి ఆత్మహత్య, అప్పుల భాదలే కారణం అంటున్న స్థానికులు

అనకాపల్లి పట్టణంలో విషాదకర ఘటన చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద ప్యారడైజ్ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

Four Of Family End Life In Visakhapatnam (Photo-X/Pixabay)

అనకాపల్లి పట్టణంలో విషాదకర ఘటన చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద ప్యారడైజ్ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను రామకృష్ణ, మాధవి, వైష్ణవి, జాహ్నవిగా గుర్తించారు. అప్పులు బాధలు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన స్వర్ణకారుడు రామకృష్ణ కొన్నేళ్ల క్రితం పని నిమిత్తం అనకాపల్లి పట్టణంలోని ఓ ఫ్లాట్‌లో నివాసముంటున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.వారు గురువారం రాత్రి విషం సేవించి ఉండవచ్చని, ఆ తర్వాత నలుగురు చనిపోయారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now