Andhra Pradesh: చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం, తండ్రీ కొడుకులతో సహా ముగ్గురు సజీవ దహనం, అర్థరాత్రి పేపర్ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో ఒక్కసారిగా ఎగసిన మంటలు
పేపర్ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనం అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రంగాచారి వీధిలో ఉన్న పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పేపర్ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనం అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రంగాచారి వీధిలో ఉన్న పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మృతుల్ని భాస్కర్, ఢిల్లీ బాబు, బాలాజీగా గుర్తించారు. షార్ట్ స్కర్యూట్‌తో అర్ధరాత్రి 2గం. సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మృతుల్లో తండ్రీకొడుకులతో పాటు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)