144 Section in Macherla: మాచర్లలో 144 సెక్షన్ ఈనెల 22వ తేదీ వరకు పొడిగింపు, అనుమతి లేకుండా ర్యాలీలు,సభలు,బహిరంగసభలు నిర్వహించకూడదని పోలీసుల ఆదేశాలు
పల్నాడు జిల్లాలో మాచర్ల పట్టణంలో శాంతిభద్రతల దృష్ట్యా ఈనెల 22వ తేదీ వరకు 144 సెక్షన్‌ను పొడిగించినట్లు అర్బన్ సీఐ టి బాలకృష్ణ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 16వ తేదీన పట్టణంలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో విధించిన 144 సెక్షన్ పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.

అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, బహిరంగసభలు నిర్వహించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి 144 సెక్షన్‌కు అనుగుణంగా నిబంధనలు పాటించాలని సీఐ కోరారు. రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)