Bird Flu in Nellore: నెల్లూరులో బర్డ్‌ ఫ్లూ కలకలం, ఒకే రోజు వేల సంఖ్యలో కోళ్ల మృతి, మూడు రోజుల పాటు చికెన్‌ షాపులు మూసివేయాలని ఆదేశాలు

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో, కోళ్లకు సంబంధించిన శాంపిల్స్‌ను పశుసంవర్ధకశాఖ అధికారులు భోపాల్‌లోని టెస్టింగ్‌ కేంద్రానికి పంపించారు. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్‌ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి.

China Reports 1st Human Case Of H3N8 Bird Flu

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. జిల్లాలోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్‌ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు కోళ్ల కళేబరాల నుంచి శాంపిల్స్‌ సేకరించి భోపాల్‌లోని టెస్టింగ్‌ కేంద్రానికి పంపించారు. బర్డ్‌ ఫ్లూతోనే కోళ్లు చనిపోతున్నాయని జిల్లా యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది.

ఈ నేపథ్యంలో కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్‌ షాపులు మూసివేయాలని, ‍కిలోమీటర్‌ పరిధిలో ఉన్న చికెన్‌ షాపులు మూడు నెలల పాటు మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచనలు చేశారు. అలాగే, బర్డ్‌ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. మనుషులలో ఆరుగురికి బర్డ్ ఫ్లూ వైరస్‌, మానవాళిని టార్గెట్ చేసే కొత్త వైరస్‌లు మళ్లీ పుట్టుకురావచ్చని డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now