Minister Botsa press Meet: సీఎం జగన్ ఉపాధ్యాయులను సత్కరించడం టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదు, చంద్రబాబుకి మానవత్వం లేదని తెలిపిన మంత్రి బొత్స

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించడం టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

botsa-satyanarayana (Photo-Video Grab)

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించడం టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ నేతలు ఒక పండుగ లాంటి రోజు కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ గురువును అవహేలన చేస్తున్నారు. దీన్ని చూస్తే చంద్రబాబునాయుడు ఎంత దిగజారిపోయాడో స్పష్టమవుతోంది. చంద్రబాబుకి మానవత్వం లేదు.. విలువలు లేవని విమర్శించారు.

సెప్టెంబర్ 5 ఆయన ఇష్టపడే రోజు కాదు. ఆయనకి వెన్నుపోటు పొడిచిన రోజంటే ఇష్టం. ఇలాంటి రాజకీయాలు, చీటింగులు ఆరోజు మాట్లాడుకోవాలి. వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీ, రాధాకృష్ణలు ఆయన గురువులు. గురువులు అనే పదాన్ని ఈ రకంగా కించపరచడం సబబా? అని ప్రశ్నించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)