AP Cabinet Meeting Highlights: వైద్య కళాశాలల్లో అదనపు పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం, మరో 380 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో కేబినెట్ భేటీ అంశాలను వివరించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో కేబినెట్ భేటీ అంశాలను వివరించారు.నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన కొత్త వైద్య కళాశాలల్లో గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మరో 380 పోస్టులు భర్తీ చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం, ఏపీ క్యాబినెట్ సమావేశం హైలెట్స్ ఇవిగో..
ఫేజ్- 2కింద పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెలో నిర్మించిన వైద్య కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభించడానికి చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లో ఉన్న పీపీపీ మోడల్‌ను అధ్యయనం చేయాలని సీఎం సంబంధిత శాఖల మంత్రులు, అధికారుల్ని ఆదేశించారని వెల్లడించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)