AP Cabinet Meeting Highlights: పట్టాదారు పాసు పుస్తకాల నుండి జగన్ ఫోటో ఔట్, ప్రభుత్వ అధికారిక రాజముద్రతో కొత్త పాసు పుస్తకాల పంపిణీ
సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. రీ సర్వేపై క్యాబినెట్‌లో రెవెన్యూశాఖ నోట్ సమర్పించింది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో కేబినెట్ భేటీ అంశాలను వివరించారు.సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. రీ సర్వేపై క్యాబినెట్‌లో రెవెన్యూశాఖ నోట్ సమర్పించింది. దీనివల్ల తలెత్తిన వివాదాలపైనా చర్చ జరిగింది.గత ప్రభుత్వ విధానం వల్ల రీ-సర్వేపై ఆందోళన ఉందని మంత్రులు తెలిపారు. భూ యజమానుల్లో ఆందోళనతో గ్రామాల్లో వివాదాలు పెరుగుతాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. రీ- సర్వే ప్రక్రియను అబేయెన్స్‌లో పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఏపీలో అక్టోబర్1 నుండి కొత్త మద్యం పాలసీ, అత్యంత తక్కువ ధరకే బ్రాండెడ్ మద్యం,మంత్రి పార్థసారథి వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)