Free Gas Cylinders from Diwali: వీడియో ఇదిగో, దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, సూపర్‌ సిక్స్‌ హామీని అమలు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు

సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Chandrababu Naidu (Photo-X/TDP)

ఇక రాష్ట్రంలో మహిళలకు ఎన్డీయే ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహాశక్తి పథకం కింద పేదలకు ఉచితంగా మూడు వంట గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్‌ కార్డు ఉన్న లబ్ధిదారులకు.. ప్రతి ఇంటికి 3 గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది.   రూ. 99కే క్వాలిటీ మద్యం,నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం, ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవిగో..

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)