YouTube Academy in Andhra Pradesh: అమరావతిలో యూట్యూబ్‌ అకాడమీ, ఎక్స్ వేదికగా ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన యూట్యూబ్‌ సీఈవో నీల్‌ మోహన్‌, గూగుల్‌ ఏపీఏసీ హెడ్‌ సంజయ్‌ గుప్తాలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూట్యూబ్‌ అకాడమీ ఏర్పాటుపై వారితో చర్చించినట్లు చంద్రబాబు ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు.

ap-cm-chandrababu-naidu-government-to-continue-village-volunteer-system(X)

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన యూట్యూబ్‌ సీఈవో నీల్‌ మోహన్‌, గూగుల్‌ ఏపీఏసీ హెడ్‌ సంజయ్‌ గుప్తాలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూట్యూబ్‌ అకాడమీ ఏర్పాటుపై వారితో చర్చించినట్లు చంద్రబాబు ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, నైపుణ్యాభివృద్ధి, సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లను ప్రోత్సహించేందుకు స్థానిక భాగస్వాముల సహకారంతో ఈ అకాడమీ ఏర్పాటుపై చర్చించినట్లు తెలిపారు. అలాగే, ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయబోయే మీడియా సిటీకి సాంకేతిక సహకారం అందించే అవకాశాలపైనా వారితో చర్చించినట్లు పేర్కొన్నారు.

Here's Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement