CM Jagan in Action: గృహ నిర్మాణ శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం రివ్యూ, హాజరయిన ఉన్నతాధికారులు

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. గృహ నిర్మాణం వేగవంతంగా ముందుకు సాగాలని సీఎం అన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధానత్య ఇవ్వాలన్నారు. విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణ పనులు కూడా వేగంగా జరగాలన్నారు. కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

CM-YS-jagan-Review-Meeting

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న‌ గృహనిర్మాణ శాఖపై సమీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్ డి.దొరబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై. శ్రీలక్షి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్ కె. విజయానంద్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె. వి. వి. సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌. శ్రీధర్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ ఎన్‌. భరత్‌ గుప్తా, సీసీఎల్‌ఎ కార్యదర్శి అహ్మద్‌ బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. గృహ నిర్మాణం వేగవంతంగా ముందుకు సాగాలని సీఎం అన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధానత్య ఇవ్వాలన్నారు. విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణ పనులు కూడా వేగంగా జరగాలన్నారు. కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement