Pawan Kalyan Meets Chandrababu: వీడియో ఇదిగో, సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడం విశేషం. పవన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు తొలిసారిగా సచివాలయంలోని తన చాంబర్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడం విశేషం. పవన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చంద్రబాబు చాంబర్ లోని ఏపీ అధికారిక చిహ్నం చూపించిన పవన్ కల్యాణ్... ఆ గుర్తుకు వన్నె తీసుకువచ్చారంటూ చంద్రబాబును కొనియాడారు. అందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇరువురు సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం చంద్రబాబు, పవన్ భేటీ కావడం ఇదే ప్రథమం. పవన్ కల్యాణ్ చాంబర్ కు వచ్చిన సందర్భంగా ఆయనను పలువురు అధికారులు కలిశారు. పవన్ తనకు కేటాయించిన పంచాయతీరాజ్ శాఖ వ్యవహారాలపై ఆరా తీశారు. పవన్ తో సచివాలయానికి వచ్చిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ కూడా ఉన్నారు.
Here's Video and Pics
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)