Andhra Pradesh Elections 2024: విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా ఇదిగో..

రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా వైఎస్సార్‌సీపీ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ఆరు పార్లమెంట్‌ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది.

YSRCP Flag (Photo-File image)

రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా వైఎస్సార్‌సీపీ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ఆరు పార్లమెంట్‌ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది. తాడేపల్లిలో గురువారం పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలను మీడియాకు తెలియజేశారు.

శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్‌ చేస్తూ.. ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ మూడో జాబితాను రూపొందించారు. తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో జాబితాను 21 స్థానాలతో విడుదల చేసింది. వీటితో పాటు ప్రస్తుతం ఇచ్ఛాపురం జెడ్పీటీసీగా ఉన్న ఉప్పాడ నారాయణమ్మను.. శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Here's List

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now