Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్, పేదలంటే చంద్రబాబుకు ఎంత అలుసు అని మండిపాటు

శింగనమల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులును ప్రకటించిన సంగతి విదితమే.మేం టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చామని చంద్రబాబు హేళన చేశాడు. మాది పేదవాళ్ల పార్టీ.. అందుకే టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాం. వీరాంజనేయులు చదివింది..

CM Jagan Mohan Reddy Clarity on Ticket For Tipper Driver at Memantha Siddham Meeting in Yemmiganur (Photo-Video Grab)

Memantha Siddham Meeting At Yemmiganur: శింగనమల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులును ప్రకటించిన సంగతి విదితమే.మేం టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చామని చంద్రబాబు హేళన చేశాడు. మాది పేదవాళ్ల పార్టీ.. అందుకే టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాం. వీరాంజనేయులు చదివింది.. చంద్రబాబు కంటే పెద్ద చదువు. వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్‌ చదివాడు. బీఈడీ కూడా చేశాడు. బాబు హయాంలో ఉద్యోగం దొరక్క టిప్పర్‌ డ్రైవర్‌ అయ్యాడు. పేదవాడైన వీరాంజనేయులు ఎదగాలనే టికెట్‌ ఇచ్చామని సీఎం చెప్పారు.175 నియోజకవర్గాల్లో తాను వంద మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చానని ఆయన తెలిపారు.పేదలంటే చంద్రబాబుకు ఎంత అలుసు అని జగన్ ప్రశ్నించారు.

చంద్రబాబు హయాంలో ఉద్యోగం దొరకక వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ గా మారాడన్నారు. వీరాంజనేయులు మన పార్టీ కార్యకర్త అని, కొన్నేళ్ల నుంచి వైసీపీ జెండాను మోసిన వ్యక్తి అని జగన్ తెలిపారు. అందుకే పేదవాడు అని చూడకుండా తాను టిక్కెట్ ఇచ్చానని అన్నారు. జగన్ పేదల పక్షపాతి అని అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని జగన్ ప్రశ్నించారు. రాజకీయాల్లో పేద, ధనికులు తేడా లేదని, సేవ చేసే వారు ఎవరైనా రావచ్చని చాలా మంది నిరూపించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now