Andhra Pradesh: ఒకటో తేదీ ఇంటికి రాని పెన్సన్, ఇద్దరు వృద్ధులు గుండెపోటుతో మృతి, ఎక్స్ వేదికగా ప్రతిపక్షాలపై వైసీపీ ఫైర్

కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ అందలేదన్న బాధతో ఓ వృద్ధుడు గుండె ఆగి మరణించాడు.కూలీ పని చేసుకునే వెంకట్రావ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట్రావ్ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.

Two Elder Dies of Heart Attack for Fearing Pension not will Come to Home in Future

కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ అందలేదన్న బాధతో ఓ వృద్ధుడు గుండె ఆగి మరణించాడు. కూలీ పని చేసుకునే వెంకట్రావ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట్రావ్ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. అంతేకాదు.. వెంకట్రావ్ మృతి చెందిన విషయాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

వెంకట్రావ్‌ మృతిపై చలించిపోయిన సీఎం జగన్‌.. వెంకట్రావ్‌ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే తిరుపతి జిల్లా వెంకటగిరిలో వెంకటయ్య అనే మరో వృద్ధుడు మృతి చెందాడు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్‌ను ఇవ్వరన్న మనస్తాపంతో గుండెపోటుతో అక్కడికక్కడే వెంకటయ్య కుప్పకూలిపోయాడు. ఈ అంశంపై వైసీపీ పార్టీ ఎక్స్ వేదికగా ప్రతిపక్షాలపై విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టింది. పెన్సన్ ఇంటికి రాదేమోననే భయంతో ఇద్దరు గుండెపోటుతో మృతి, పెన్సన్ల పంపిణీపై మార్గదర్శకాలు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

Here's YSRCP Tweet

p

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement