Andhra Pradesh Pharma Company Explosion: అచ్యుతాపురం పేలుడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌

అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రియాక్టర్‌ పేలుడు ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Andhra Pradesh Factory Blast: YS Jagan expresses shock over reactor explosion at Atchutapuram SEZ, extends condolences to victims' families (photo-ANI)

అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రియాక్టర్‌ పేలుడు ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.  పేలుడు ధాటికి ఛిద్రమైన కార్మికుల మృతదేహాలు, అచ్యుతాపురం సెజ్‌అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య, మరో 50 మందికి గాయాలు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నాను. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలి. వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలి. మా పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుంది. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి. మళ్లీ ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలి.’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Here's Jagan Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Health Tips: పొద్దున్నే లేవగానే కడుపు కదలడం లేదా..మలబద్ధకంతో మెలికలు తిరిగి పోతున్నారా...అయితే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు... క్షణాల్లో కడుపు ఖాళీ ఇవ్వడం ఖాయం...

Health Tips: మీ శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగాయి అయితే సొరకాయ రసంతో ఈ సమస్యకు చక్కటి పరిష్కారం..

IPS Officers: ఏపీకి వెళ్లి నేడే రిపోర్ట్ చేయండి.. తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న ముగ్గురు ఏపీ క్యాడ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు కేంద్ర హోంశాఖ‌ ఆదేశాలు

Free Chicken Distribution In Guntur: హైదరాబాద్ లోనే కాదు.. గుంటూరులోనూ ఫ్రీగా వేడి వేడి చికెన్‌ సప్లయ్.. ఆవురావురుమంటూ తిన్న జనం.. చికెన్ మేళాలు పెట్టి మరీ వండిన చికెన్ ను ఉచితంగా ఎందుకు వడ్డిస్తున్నారంటే? (వీడియో)

Share Now