Andhra pradesh Shocker: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన రైతు, ఓటీపీ మెస్సెజ్‌ లింక్ ఓపెన్‌ చేయడంతో జరిగిన నష్టం, 1930కి కాల్, రంగంలోకి పోలీసులు

ఓ రైతు టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం కోమటిగుంట గ్రామానికి చెందిన యలమంచిలి బాబ్జి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంక్‌లో సేవింగ్‌ అకౌంట్‌ ఉండగా ఈనెల 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్‌ ఫోన్‌కి ఓటీపీ మేసేజ్‌లు వచ్చాయి.

Andhra pradesh farmer loses Rs 38,500 in cyber fraud , Police registered FIR(X)

Vij, Aug 9: ఓ రైతు టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం కోమటిగుంట గ్రామానికి చెందిన యలమంచిలి బాబ్జి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంక్‌లో సేవింగ్‌ అకౌంట్‌ ఉండగా ఈనెల 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్‌ ఫోన్‌కి ఓటీపీ మేసేజ్‌లు వచ్చాయి.

ఓపెన్‌ చేసి చూస్తుండగా తన బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి వరుసుగా 7 సార్లు 5 వేలు, ఒకసారి 3,500 చొప్పున మొత్తం రూ.38,500 కట్‌ అయ్యాయి. బ్యాంక్‌ యాప్‌లో చూసుకోగా వినీష్‌ కుమార్‌ అనే వ్యక్తికి నగదు బదిలీ అయినట్లు గమనించిన వెంటనే 1930 నెంబర్‌కి ఫోన్‌ చేసి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం బ్యాంక్‌కు వెళ్ళి అకౌంట్‌ ఫ్రీజ్‌ చేయించాడు. బస్సు ఆపలేదని కండక్టర్‌పై పాము విసిరిన మహిళ, మద్యం మత్తులో బస్సుపై బీర్ బాటిల్‌తో దాడి, వీడియో వైరల్‌ 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now