Andhra Pradesh: అన్నవరం యూనియన్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం, ఫర్నిచర్, ఇతర సామాగ్రి ధ్వంసం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం
గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో బ్యాంకులో మంటలు చెలరేగాయి. బ్యాంకు నుంచి మంటలు వ్యాపించడం చూసిన స్థానికులు.. అధికారులకు సమాచారమిచ్చారు.
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం యూనియన్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో బ్యాంకులో మంటలు చెలరేగాయి. బ్యాంకు నుంచి మంటలు వ్యాపించడం చూసిన స్థానికులు.. అధికారులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి.
బ్యాంకులో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో.. ఫర్నిచర్, ఇతర సామాగ్రి ధ్వంసమైంది. అయితే డబ్బులు, పత్రాలు భద్రపరిచే లాకర్ సురక్షితంగా ఉన్నట్టుగా సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)