Fishermen Protest in Kakinada: కాకినాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, అరబిందో పైప్ లైన్ తీయాలంటూ పెట్రోలు పోసుకొని మత్స్యకారుల ఆందోళన
ధర్నా చేపట్టి శుక్రవారంకి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులు రాజకీయ నాయకుల్లో ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ బోట్లుకి తామే నిప్పంటించుకొని మత్స్యకారులు తీవ్ర నిరసన తెలిపారు.
సముద్రంలో వేసిన అరబిందో పైప్ లైన్ తీయాలంటూ … గత మూడు రోజుల నుంచి కాకినాడలో ధర్నా (Fishermen Protest in Kakinada) చేస్తున్న మమ్మల్ని అధికారులు పట్టించుకోవటం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. ధర్నా చేపట్టి శుక్రవారంకి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులు రాజకీయ నాయకుల్లో ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ బోట్లుకి తామే నిప్పంటించుకొని మత్స్యకారులు తీవ్ర నిరసన తెలిపారు. అరబిందో పైప్ లైన్ తీయకపోతే మత్స్య సంపద కనుమరుగవుతుందంటూ మత్స్యకారులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
గతంలో మత్స్యకారులంతా ధర్నాలు చేపడితే అధికారులు హామీ ఇచ్చి ఇప్పటికీ పైపులైన్‌లను తీయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా మత్స్యకారులు తమ ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆందోళన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు.
Here's News