Gautam Sawang: ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్, ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు
విజయవాడ బందర్‌రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దామోదర్ గౌతమ్ సవాంగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్‌రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది గౌతమ్ సవాంగ్‌కు అభినందనలు తెలిపారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)