YS Jagan Meets Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్, జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు
టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత జగన్ కలిశారు. కాసేపటి క్రితం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న జగన్.... విమానాశ్రయం నుంచి జైలుకు వెళ్లారు. ములాఖత్ ద్వారా వంశీని కలిశారు. ఆయనను పరామర్శించారు. జైలు వద్ద వంశీ భార్య పంకజశ్రీ కూడా ఉన్నారు.

జైలు వద్ద పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలుకు కొంత దూరంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, జైలు వద్దకు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. మీడియాను, కొందరు నేతలను మాత్రమే జైలు వరకు అనుమతించారు. ములాఖత్ అనంతరం మీడియాతో జగన్ మాట్లాడే అవకాశం ఉంది.వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు.
జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు