YS Jagan Praja Darbar: వైఎస్ జగన్ ప్రజాదర్బార్ వీడియోలు ఇవిగో, ఇంకా ఏ మాత్రం తగ్గని క్రేజ్, అధినేతను కలవడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ ను నేడు విశాఖపట్నంకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ నేతలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు కలిశారు. దాంతో తాడేపల్లిలోని ఆయన కార్యాలయం కోలాహలంగా మారింది. వైజాగ్ వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు నేడు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చారు. జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ ను నేడు విశాఖపట్నంకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ నేతలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు కలిశారు. దాంతో తాడేపల్లిలోని ఆయన కార్యాలయం కోలాహలంగా మారింది. వైజాగ్ వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు నేడు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చారు. జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యకర్తల కోసం తెరుచుకున్న వైఎస్ జగన్ బంగ్లా తలుపులు, ప్రజాదర్బార్ పేరిట ప్రజలతో మమేకమవుతున్న మాజీ ముఖ్యమంత్రి
పార్టీ అధినేతకు శాలువాలు కప్పి సన్మానించారు. పుష్పగుచ్ఛాలు అందించారు. కొందరు మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టి ఆశీస్సులు అందుకున్నారు. పలువురు జగన్ కు జ్ఞాపికలు బహూకరించారు. ఈ సందర్భంగా వారితో జగన్ ముచ్చటించారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ వైఖరిని వారికి వివరించారు. నిన్న సామాన్యులను కూడా తనను కలిసేందుకు అవకాశమిచ్చిన జగన్ ఇవాళ పార్టీ కార్యకర్తలను కూడా కలిశారు. వారితో సెల్ఫీలు దిగారు. వారితో మాట్లాడి ఉత్సాహం కలిగించారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)