Tadepalligudem Road Mishap: పండగ వేళ ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి బోల్తా పడిన చేపల లోడ్ లారీ, నలుగురు అక్కడికక్కడే మృతి

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Tadepalligudem Road Mishap (Photo-ANI)

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా లారీలోని చేపలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో లారీలో పది మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన కూలీలను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement