Andhra Pradesh Government Formation: ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం, కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద కార్యక్రమం

టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తాజాగా చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం వేదిక, సమయం ఖరారు చేశారు. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు

Chandrababu (Photo0TDP/X)

టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తాజాగా చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం వేదిక, సమయం ఖరారు చేశారు. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు.  కొత్తగా ఏర్పడబోయే టీడీపీ మంత్రివర్గం ఇదేనా? ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం, స్పీకర్ గా ఆయనేనా..

టీడీపీ అగ్రనేతలు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్ తదితరులు ప్రమాణ స్వీకార సభా స్థలాన్ని పరిశీలించారు. కాగా, చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ముఖ్యమంత్రులు వస్తుండడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నేతలు తొలుత మంగళగిరి ఎయిమ్స్ వద్ద స్థలాన్ని పరిశీలించినప్పటికీ... అది అనువుగా లేకపోవడంతో గన్నవరం స్థలాన్ని ఖరారు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 164 స్థానాలతో ప్రభంజనం సృష్టించడం తెలిసిందే. టీడీపీ 135 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement