Andhra Pradesh: కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు, సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో.. ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఐఏఎస్ బుడితి రాజశేఖర్, ఐఆర్‌ఎస్ రామకృష్ణకు నెల రోజుల జైలుశిక్షతో పాటు ₹2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు మొదట తీర్పు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో.. ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఐఏఎస్ బుడితి రాజశేఖర్, ఐఆర్‌ఎస్ రామకృష్ణకు నెల రోజుల జైలుశిక్షతో పాటు ₹2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు మొదట తీర్పు ఇచ్చింది. వీరిద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
అయితే సదరు అధికారులు ఇద్దరు హైకోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పడంతో తీర్పును ధర్మాసనం సవరించింది. సాయంత్రం వరకు కోర్టులోనే నిలబడాలని ఆదేశించింది.గతంలో రాజశేఖర్.. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు ముఖ్య కార్యదర్శిగా పనిచేయగా.. ఇంటర్ బోర్డు కమిషనర్‌గా రామకృష్ణ పనిచేశారు. ప్రస్తుతం రామకృష్ణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఐజీగా ఉన్నారు.
Here's News Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)