Andhra Pradesh Horror: దారుణం, రూ.కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందనే ఆశతో సొంత చెల్లిని చంపిన అన్న, వీడియో ఇదిగో..

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా(Prakasham Dist) పొదిలి మండలం కాటూరివారిపాలెంలో ఇన్సూరెన్స్ డబ్బుల(Insurance Money) కోసం సొంత చెల్లిని.. అన్న అతికిరాతకంగా హత్య చేశాడు. రూ.కోటి రూపాయల డబ్బు వస్తుందనే ఆశతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Brother kills sister for insurance money in Prakasam Dist (Photo-Video Grab)

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా(Prakasham Dist) పొదిలి మండలం కాటూరివారిపాలెంలో ఇన్సూరెన్స్ డబ్బుల(Insurance Money) కోసం సొంత చెల్లిని.. అన్న అతికిరాతకంగా హత్య చేశాడు. రూ.కోటి రూపాయల డబ్బు వస్తుందనే ఆశతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం యాక్సిడెంట్‌(Accident)గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నారు.

కేసులో దొరకకుండా ఉండేందుకు పోస్టుమార్టం రిపోర్టును సైతం మార్చేందుకు నిందితుడు ప్రయత్నించారని అన్నారు. పోస్టుమార్టం మార్చేందుకు మూడున్నర లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాలు అన్నీ దర్యాప్తులో తేలాయని, నిందితుడు సైతం వీటిని అంగీకరించినట్లు పొదిలి సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. నిందితుడికి మరో ఇద్దరు సహకరించారని, వారిని సైతం అరెస్టు చేస్తామని అన్నారు.

రూ.కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందనే ఆశతో సొంత చెల్లిని చంపిన అన్న

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now