Andhra Pradesh: డ్రగ్స్‌పై పవన్‌కల్యాణ్ వరస ట్వీట్లు, జనసేన పోరాట యాత్రకు సిద్దమంటూ వీడియో

గంజాయి సాగు నిజంగా సామాజిక ఆర్థిక అంశమని చెప్పారు. విశాఖ మన్యం నుంచి తుని వరకు ఉపాధి లేని, చదువు పూర్తయిన యువకులు ఈ వలలో చిక్కుకుంటున్నారని చెప్పారు. కింగ్‌ పిన్స్ మాత్రం రిస్క్‌ లేకుండా సంపాదిస్తున్నారని ఆరోపించారు.

Janasena Chief Pawan Kalyan | File Photo

డ్రగ్స్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వరస ట్వీట్లు చేశారు. గంజాయి సాగు నిజంగా సామాజిక ఆర్థిక అంశమని చెప్పారు. విశాఖ మన్యం నుంచి తుని వరకు ఉపాధి లేని, చదువు పూర్తయిన యువకులు ఈ వలలో చిక్కుకుంటున్నారని చెప్పారు. కింగ్‌ పిన్స్ మాత్రం రిస్క్‌ లేకుండా సంపాదిస్తున్నారని ఆరోపించారు. మన్యంలో ఇప్పుడు గంజాయి పంట ముఖ్య దశలో ఉందన్నారు. నవంబర్, డిసెంబర్ నుంచి కటింగ్ మొదలవుతుందని పేర్కొన్నారు. అప్పుడు ఇంకా ఎక్కువ బయటకు వస్తుందన్నారు. గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారని గుర్తుచేశారు. ఆ పని వదిలి.. ఇప్పుడు బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారని చెప్పారు. సీజ్ చేసిన దానికంటే.. రాష్ట్రం దాటిపోతున్న సరుకే ఎక్కువన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)