Andhra Pradesh: పిఠాపురం టీడీపీ ఇంఛార్జి వర్మపై దాడి, కాకినాడ జనసేన ఎంపీ టీ టైం ఉదయ్ అనుచరులే దాడి చేశారని వర్మ అరోపణలు
ఈ ఘటనలో వర్మ కారు ధ్వంసం అయ్యింది. ఆయనకు గాయలు అయ్యాయా? అనేది తెలియాల్సి ఉంది.
పిఠాపురంలో జనసేన శ్రేణులు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మపై దాడికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో వర్మ కారు ధ్వంసం అయ్యింది. ఆయనకు గాయలు అయ్యాయా? అనేది తెలియాల్సి ఉంది. వెన్నపూడి గ్రామ సర్పంచ్‌ను టీడీపీలో చేర్చుకునేందుకు శుక్రవారం సాయంత్రం వర్మ వెళ్లారు.
అయితే వర్మ రాకను వ్యతిరేకించిన జనసేన శ్రేణులు రాళ్ల దాడికి దిగినట్లు తెలుస్తోంది.. ఈ దాడిలో ఆయన వాహనం ధ్వంసం అయ్యింది. జనసేన నుండి కాకినాడ ఎంపీ గా ఎన్నికైన Tea Time Uday వర్గీయులు అని వర్మ ఆరోపణ చేస్తున్నారు.కాగా పిఠాపురంలో తన సీటును త్యాగం చేసిన వర్మ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపు కోసం పని చేసిన సంగతి తెలిసిందే. వీడియో ఇదిగో, వల్లభనేని వంశీ ఇంటిపై కర్రలతో టీడీపీ శ్రేణులు దాడి, టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టిన ప్రత్యేక బలగాలు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)