Corona in AP: ఏపీలో కొత్తగా 1,174 మందికి కరోనా పాజిటివ్, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 208 కొత్త కేసులు, రాష్ట్రంలో ప్రస్తుతం 14,653 మందికి కొనసాగుతున్న చికిత్స

Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 55,525 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1174 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 208 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 159, నెల్లూరు జిల్లాలో 122, కృష్ణా జిల్లాలో 140 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 5 కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,309 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,34,458 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,05,744 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 14,653 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,061కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)