Coronavirus in AP: ఏపీలో కొత్తగా 159 మందికి కరోనా, అత్యధికంగా విశాఖ జిల్లాలో 28 కొత్త కేసులు నమోదు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 29,263 కరోనా శాంపిళ్లు పరీక్షించగా, 159 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 28 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 23, పశ్చిమ గోదావరి జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus | Representational Image | (Photo Credits: Pixabay)

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 29,263 కరోనా శాంపిళ్లు పరీక్షించగా, 159 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 28 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 23, పశ్చిమ గోదావరి జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 169 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,252 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,56,670 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,138 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,444కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement