Corona in AP: ఏపీలో కొత్తగా 193 మందికి కరోనా పాజిటివ్, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 మందికి కోవిడ్

గత 24 గంటల్లో ఏపీలో 31,101 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 193 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 మంది కరోనా బారిన పడ్డారు. కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 164 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

Coronavirus test (Photo-ANI)

గత 24 గంటల్లో ఏపీలో 31,101 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 193 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 మంది కరోనా బారిన పడ్డారు. కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 164 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా వల్ల మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,037 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,74,410కి చేరుకుంది. మొత్తం 20,57,913 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,460 మంది మృతి చెందారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement