Corona in AP: ఏపీలో కొత్తగా 264 మంది కరోనా, 247 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో ఇంకా 2,175 కేసులు యాక్టివ్‌

ఏపీలో నిన్న 196 మంది కరోనా బారినపడగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 264 మంది కరోనా బాధితులుగా మారారు. అలాగే, కొవిడ్ బారినపడి కృష్ణా జిల్లాలో ఒకే ఒక్క మరణం నమోదైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 247 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,987 మందిని పరీక్షించారు.

Coronavirus in India (Photo Credits: PTI)

ఏపీలో నిన్న 196 మంది కరోనా బారినపడగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 264 మంది కరోనా బాధితులుగా మారారు. అలాగే, కొవిడ్ బారినపడి కృష్ణా జిల్లాలో ఒకే ఒక్క మరణం నమోదైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 247 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,987 మందిని పరీక్షించారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కొవిడ్ పరీక్షల సంఖ్య 3,02,55,667కి పెరిగింది.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,71,831కి పెరగ్గా, 14,430 మంది మరణించారు. రాష్ట్రంలో ఇంకా 2,175 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక, కర్నూలులో అత్యల్పంగా మూడు కేసులు మాత్రమే వెలుగు చూడగా, తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 46 కేసులు నమోదయ్యాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement