Corona in AP: ఏపీలో గత 24 గంటల్లో కేవలం 5 కేసులు మాత్రమే నమోదు, కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఇదే అత్యల్పం

Coronavirus

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. గడచిన 24 గంటల్లో 8,219 కరోనా పరీక్షలు నిర్వహించగా, 5 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఇదే అత్యల్పం అనుకోవచ్చు! కృష్ణా జిల్లాలో 2 కేసులు వెల్లడి కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, కడప జిల్లాలో 1 కేసు గుర్తించారు. మిగతా జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 37 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,509 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,465 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 314 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)