Corona in AP: ఏపీలో కొత్తగా 82 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 23, నెల్లూరు జిల్లాలో 11 కొత్త కేసులు

ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో 25,086 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 82 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 23, నెల్లూరు జిల్లాలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి.

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో 25,086 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 82 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 23, నెల్లూరు జిల్లాలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం, కడప జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,76,492 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,60,836 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,166 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,490కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement