COVID in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి, గత 24 గంటల్లో 840 మందికి కోవిడ్, అత్యధికంగా విశాఖ జిల్లాలో 183 కొత్త కేసులు నమోదు
ఏపీలో కరోనా వ్యాప్తి మళ్లీ పుంజుకుంది. గత కొన్నిరోజులుగా 500కి పైబడి కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 37,849 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 840 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 183 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 150 కేసులను గుర్తించారు.
ఏపీలో కరోనా వ్యాప్తి మళ్లీ పుంజుకుంది. గత కొన్నిరోజులుగా 500కి పైబడి కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 37,849 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 840 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 183 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 150 కేసులను గుర్తించారు. అదే సమయంలో 133 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,79,763 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,62,290 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,972 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,501కి పెరిగింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement