Ambati Rambabu vs Nagababu: నాగబాబుకు పంచ్ రిప్లై ఇచ్చిన అంబటి రాంబాబు, పోలవరం పూర్తి చేసి మీ అన్నాదమ్ముళ్ల చేత డ్యాన్స్ వేయిస్తామంటూ ట్వీట్
నాగబాబు సెటైర్ పట్ల అంబటి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. 'నువ్వు, నీ తమ్ముడు అన్నట్టు నేను సంబరాల రాంబాబునే. కానీ ముఖానికి రంగు వేయను. ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను' అని వ్యాఖ్యానించారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో భోగి వేడుకల సందర్భంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. బంజారా మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా అంబటి సరదాగా గడిపారు. తాను డ్యాన్స్ చేసిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.
మరోవైపు అంబటి పోస్టుపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు స్పందించారు. 'సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేశారు. పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి ఉంటే ఇంకా మహత్తరంగా ఉండేది' అని ఎద్దేవా చేశారు. నాగబాబు సెటైర్ పట్ల అంబటి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. 'నువ్వు, నీ తమ్ముడు అన్నట్టు నేను సంబరాల రాంబాబునే. కానీ ముఖానికి రంగు వేయను. ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను' అని వ్యాఖ్యానించారు.
Here's Tweets
Here's Nagababu Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)