Andhra Pradesh: 14 వేల కిలోల గంజాయిని తగలబెట్టిన ఏపీ పోలీసులు, గత 30 ఏళ్లలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని దహనం చేసిన పోలీసులు

గత 30 ఏళ్లలో వివిధ కేసుల్లో పట్టుబడిన 14 వేల కిలోల గంజాయిని ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పోలీస్ కమిషనర్ కంఠీ రాణా టాటా సమక్షంలో పోలీసులు దహనం చేశారు.

Ganja Burnt (Photo-ANI)

ఆంధ్రప్రదేశ్ | గత 30 ఏళ్లలో వివిధ కేసుల్లో పట్టుబడిన 14 వేల కిలోల గంజాయిని ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పోలీస్ కమిషనర్ కంఠీ రాణా టాటా సమక్షంలో పోలీసులు దహనం చేశారు. ఇక అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కోడూరులో శనివారం ఐదు జిల్లాల పరిధిలో సీజ్‌ చేసిన గంజాయి, ద్రవరూప గంజాయి (యాస్‌ ఆయిల్‌)ని దహనం చేశారు. 929 కేసుల్లో పట్టుబడిన 1,93,384.50 కిలోల గంజాయి, 133 కిలోల యాస్‌ అయిల్‌కు డీఐజీ హరికృష్ణ నిప్పుపెట్టి దహనం చేశారు. దీని విలువ రూ. 240 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.అలాగే గుంటూరు రేంజి పరిధిలోని వివిధ జిల్లాల్లో 10,424 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ త్రివిక్రమ వర్మ తెలిపారు. శనివారం ఈ గంజాయిని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని పోలీసు ఫైరింగ్‌ రేంజ్‌ వద్ద దహనం చేసినట్లు వెల్లడించారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement