Andhra Pradesh: వీడియో ఇదిగో, జగన్ స్టిక్కర్ చింపేసిందని కుక్కపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ మహిళా నేతలు, విజయవాడలో ఘటన

అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక కుక్క ఏపీ సీఎం వైఎస్ జగన్ పోస్టర్‌ను చించుతున్న వీడియో ఇది. దీనిపై వైసీపీ నాయకురాళ్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Police complaint filed on DOG (Photo-Video Grab)

ఏపీలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక కుక్క ఏపీ సీఎం వైఎస్ జగన్ పోస్టర్‌ను చించుతున్న వీడియో ఇది. దీనిపై వైసీపీ నాయకురాళ్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విజయవాడకు చెందిన పార్టీ మహిళా నాయకురాళ్ళు నిన్న రాత్రి నేరుగా నున్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కుక్కతో పాటు దాని యజమానిపై కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు.ఫిర్యాదుతో పాటు ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోను కుక్క తొలగిస్తున్న వీడియోను సైతం జత పరిచారు. ఇక ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)