TDP Leaders Fight Video: వీడియో ఇదిగో, తిరువూరులో రక్తమెచ్చేలా తన్నుకున్న టీడీపీ తమ్ముళ్లు, అడ్డు వచ్చిన ఎస్ఐ సతీష్‌పై దాడి, మొత్తం 49 మందిపై కేసులు నమోదు
తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఘర్షణలో తిరువూరు ఎస్ఐ సతీష్ తలకు గాయాలు అయ్యాయి. కేశినేని నాని వర్గం 28 మందిపై, కేశినేని చిన్ని వర్గం 21 మందిపై కేసు నమోదు చేశారు.
తిరువూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఘర్షణలో తిరువూరు ఎస్ఐ సతీష్ తలకు గాయాలు అయ్యాయి. కేశినేని నాని వర్గం 28 మందిపై, కేశినేని చిన్ని వర్గం 21 మందిపై కేసు నమోదు చేశారు.
కాగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదని ఆయన వర్గీయులు ఆందోళనకు దిగడం గొడవకు కారణంగా తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది.దీంతో ఇరువర్గాలు గొడవపడినట్లు సమాచారం.
తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎస్‌ఐ సతీష్‌పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేశాం. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. శాంతిభద్రతలు కాపాడటానికి యత్నించిన పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేయడం శోచనీయం. సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు.
Here's Video