Kodali Nani on Vamsi Arrest: చచ్చేదాకా జగన్ వెంటే నడుస్తా, ఆ పకోడి గాళ్ళకు నేను భయపడను, పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని, వీడియో ఇదిగో..

కొడాలి నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, నారా లోకేష్ బెదిరించి అతని చేత కేసు రీ ఓపెన్ చేయించారని మండిపడ్డారు. ఇలాంటి పకోడి గాళ్ళకు నేను భయపడేది లేదని స్పష్టం చేశారు. చచ్చేదాకా జగన్ వెంటే నడుస్తానని తెలిపారు.

Kodali Nani (Photo-Video Grab)

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వంశీని అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు విజయవాడ సబ్‌ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వంశీని అరెస్టు చేసిన తీరు రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమని చెప్పారు. నాడు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరగగా... అందులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని జగన్ గుర్తుచేశారు.

వీడియో ఇదిగో, మీడియాకి కొడాలి నాని సైటైర్, అప్పుడు అంటే గవర్నమెంట్ లో ఉన్నాము యాక్టివ్‌గా ఉన్నాము. మా ఉద్యోగం పీకేశారు యాక్టివ్‌గా ఇప్పుడు ఏం చేయాలని ప్రశ్న

టీడీపీ ఆఫీసుపై దాడికి కారణం పట్టాభి రెచ్చగొట్టడమేనని వివరించారు. పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారని వివరించారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ పోలీసులు పక్షపాతం చూపించలేదని, రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారని జగన్ తెలిపారు.అప్పట్లో చేసిన ఫిర్యాదులో వల్లభనేని వంశీ పేరులేదని గుర్తుచేశారు. వంశీని ఇరికించాలనే కుట్రతో టీడీపీ ఆఫీసుపై దాడి కేసును రీఓపెన్ చేసి, వంశీని 71వ నిందితుడిగా చేర్చారని తెలిపారు.

ఇక ఇదే విషయంపై కొడాలి నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, నారా లోకేష్ బెదిరించి అతని చేత కేసు రీ ఓపెన్ చేయించారని మండిపడ్డారు. ఇలాంటి పకోడి గాళ్ళకు నేను భయపడేది లేదని స్పష్టం చేశారు. చచ్చేదాకా జగన్ వెంటే నడుస్తానని తెలిపారు.

Kodali Nani Clarity on Party Change Rumors

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

UP Shocker: దారుణం, పని మనిషికి మద్యం తాగించి అత్యాచారం చేసిన యజమాని కొడుకు, భర్త తలకు తుఫాకీ గురిపెట్టి అతని కళ్లెదురుగానే నీచమైన చర్య

Uttar Pradesh Shocker: దారుణం, కట్నం తీసుకురాలేదని భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన భర్త, ఆరోగ్యం క్షీణించడంతో నిజాలు వెలుగులోకి, అత్తింటివారిని అరెస్ట్ చేసిన పోలీసులు

Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో 55 కోట్లు దాటిన పుణ్యస్నానం ఆచరించిన భక్తుల సంఖ్య, ఈ రోజు ఒక్కరోజే 99.20 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు

Share Now