Jagan on Police Security Negligence: వీడియో ఇదిగో, రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీకు పోలీస్ భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో, చంద్రబాబుకు జగన్ వార్నింగ్

ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు? అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రతా ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు?. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?.

YS Jagan Slams CM Chandrababu (Photo-FB and YSRCP)

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులను కలిసి వారి కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని జగన్ అన్నారు.

వీడియో ఇదిగో, గుంటూరు మిర్చి యార్డు రైతులతో మాట్లాడిన జగన్, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటానికి దిగుతామని హెచ్చరిక

పర్యటన కొనసాగిన దారిలో ఎక్కడా పెద్దగా పోలీసులు ఎక్కడా కానరాలేదు. పైగా ఎక్కడా ట్రాఫిక్‌ క్లియర్‌ చేయలేదు. దీంతో జనసందోహం నడుమే నెమ్మదిగా ఆయన తన వాహనంలో మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు.దీనిపై జగన్ మీడియా వేదికగా చంద్రబాబును ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు? అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రతా ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు?. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు?. విపక్ష నేత రైతులతో మాట్లాడేందుకు వస్తే పోలీసు భద్రత కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు.

YS Jagan on Police Security Negligence:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now