kotamreddy Giridhar Reddy Joins TDP: టీడీపీలో చేరిన కోటంరెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుస్తుందని వెల్లడి

పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచుకున్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి పసుపు కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు

kotamreddy Giridhar Reddy Joins TDP (Photo-Video Grab)

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ నేత గిరిధర్ రెడ్డి నేడు టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచుకున్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి పసుపు కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. గిరిధర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో టీడీపీలోకి వచ్చారు.తెలుగుదేశం కుటుంబంలో తనను భాగస్వామిని చేసిన చంద్రబాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు.నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Here's Updates

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)