Adala Clarity on Party Change Rumors: పార్టీ మారే ప్రసక్తే లేదని తెలిపిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నుంచి నెల్లూరు రూరల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటన

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్న సంగతి విదితమే. ఈ వార్తలపై ఆదాల ప్రభాకర్‌ రెడ్డి స్పందించారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

adala-prabhakar-reddy (photo-Twitter)

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్న సంగతి విదితమే. ఈ వార్తలపై ఆదాల ప్రభాకర్‌ రెడ్డి స్పందించారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించినప్పటి నుంచి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలవడంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఆయన్ను కలిసినట్లు స్పష్టంచేశారు. వైసీపీ తరఫున నెల్లూరు రూరల్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. పార్టీని వీడే ప్రసక్తే లేదని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement