AP Road Accident: బాపట్లలో స్కూలు బస్సు బోల్తా, 9 మంది విద్యార్థులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు

Road Accident (Representational Image)

బాపట్లలో అమృతలూరు మండలం కూచిపూడి వద్ద స్కూల్‌ బస్సు బోల్తా పడటంతో 9 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సులో మొత్తం 35 మంది విద్యార్థులు ఉన్నారు. కూచిపూడి-పెద్దపూడి గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయబోతుండగా బస్సు అదుపు తప్పినట్లు తెలిసింది. స్వాతంత్ర్య వేడుకలు ముగించుకుని విద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement