Andhra Pradesh: అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు, అమరావతి రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని వెల్లడి

ఏపీ రాజధాని అమరావతిపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలోని కర్నూలు జిల్లా పరిధిలో సాగుతున్న నేపథ్యంలో... రాహుల్ ను అమరావతి రైతులు కలిశారు.

Rahul Gandhi meets Amaravati Farmers (Photo-Twitter/Congress)

ఏపీ రాజధాని అమరావతిపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలోని కర్నూలు జిల్లా పరిధిలో సాగుతున్న నేపథ్యంలో... రాహుల్ ను అమరావతి రైతులు కలిశారు. ఈ సందర్భంగా రాజధానిపై నెలకొన్న అనిశ్చితిని వారు ఆయనకు వివరించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించేలా తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ...అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అని అన్నారు. ఏపీ రాజధానిపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇదేనని కూడా రాహుల్ గాంధీ అన్నారు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి న్యాయపరమైన సాయం అందిస్తామని ఆయన తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement