Kolleru Lake: బుడమేరు తర్వాత దడ పుట్టిస్తున్న కొల్లేరు సరస్సు, పెరుగుతున్న వరదతో రోడ్డుపైకి వస్తున్న నీరు, భయం గుప్పిట్లో పలు లంక గ్రామాలు ప్రజలు
బుడమేరు నుంచి కొల్లేరుకు లింకుండడంతో కొల్లేరుకు నీటి ప్రవాహం ప్రస్తుతం భారీగా వస్తోంది. బుడమేరులో రెండో గండిని పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్‌రోడ్డును నిర్మిస్తున్నారు
ఏపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో కష్టాలు ఇంకా వీడలేదు. బుడమేరకు ఇంకా వరద కొనసాగుతోంది. ఆరు రోజులుగా విజయవాడలోని పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి.ఇప్పటికీ లోపలి ప్రాంతాలకు ఆహారం అందడం లేదు.పెరుగుతున్న వరద నీరుతో గోదావరి ప్రమాదకరంగా మారుతోంది. బుడమేరు గండ్లు పూడ్చివేతతో కొల్లేరుకు వరద ప్రవాహం ఎక్కువవుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీడియో ఇదిగో, అల్లూరి జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన సోకిలేరు వాగు, 40 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
కొల్లేరు వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు.కొల్లేరు పరివాహక ప్రాంతంలోని చిన్న అడ్లగడ్డ వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు లింకుండడంతో కొల్లేరుకు నీటి ప్రవాహం ప్రస్తుతం భారీగా వస్తోంది. బుడమేరులో రెండో గండిని పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్‌రోడ్డును నిర్మిస్తున్నారు. మూడో గండిని పూడ్చివేస్తే విజయవాడకు ముంపు ముప్పు తప్పనుందని చెబుతున్నారు. అయితే కొల్లేరుకు వరద పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)