Corona in AP: ఏపీలో కొత్తగా 12,561 మందికి కరోనా, 12 మంది మృతి, అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,710 కేసులు నమోదు
ఏపీలో గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,635 కరోనా పరీక్షలు నిర్వహించగా... 12,561 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొత్తగా 12 మంది మరణించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,710 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 1,625 కేసులు, కడప జిల్లాలో 1,215 కేసులు, విశాఖ జిల్లాలో 1,211 కేసులు వెల్లడయ్యాయి.
ఏపీలో గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,635 కరోనా పరీక్షలు నిర్వహించగా... 12,561 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొత్తగా 12 మంది మరణించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,710 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 1,625 కేసులు, కడప జిల్లాలో 1,215 కేసులు, విశాఖ జిల్లాలో 1,211 కేసులు వెల్లడయ్యాయి. విశాఖ జిల్లాలో ముగ్గురు మరణించగా, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
అనంతపురం, చిత్తూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో కన్నుమూశారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 14,591కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,48,608 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 21,20,717 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,13,300 మంది చికిత్స పొందుతున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)