Covid in AP: ఏపీలో కొత్తగా 26 మందికి కరోనా, అనంతపురం జిల్లాలో 8, తూర్పు గోదావరి జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి క్షీణదశకు చేరుకున్నట్టే. గడచిన 24 గంటల్లో 5,508 కరోనా పరీక్షలు నిర్వహించగా, 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 8, తూర్పు గోదావరి జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి. కృష్ణా, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Coronavirus | Representational Image | (Photo Credits: Pixabay)

ఏపీలో కరోనా వ్యాప్తి క్షీణదశకు చేరుకున్నట్టే. గడచిన 24 గంటల్లో 5,508 కరోనా పరీక్షలు నిర్వహించగా, 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 8, తూర్పు గోదావరి జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి. కృష్ణా, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 85 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజులో కరోనా మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,18, 884 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,03,607 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 547 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా వల్ల 14,730 మంది మరణించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement